నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, ఓట్ల లెక్కింపు సందర్భంగా అవసరమైన మేరకు స్థానిక సెలవు ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 9న, ఓట్ల లెక్కింపు 12న జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రం ఉన్న కార్యాలయాలు, సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పగించింది.
కలెక్టర్లకు స్థానిక సెలవు ప్రకటించే అధికారం - ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తాజా వార్తలు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అవసరమైన మేరకు స్థానిక సెలవు ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. పోలింగ్ ముందురోజు, పోలింగ్ నాడు, ఓట్ల లెక్కింపు రోజు అవసరమైతే స్థానిక సెలవును జిల్లా పాలనాధికారులు ప్రకటించవచ్చు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
కలెక్టర్లకు స్థానిక సెలవు ప్రకటించే అధికారం
పోలింగ్ ముందురోజు, పోలింగ్ నాడు, ఓట్ల లెక్కింపు రోజు అవసరమైతే స్థానిక సెలవును కలెక్టర్లు ప్రకటించవచ్చు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ, పుర పోరుకు పార్టీలు సిద్ధం
TAGGED:
mlc by election latest news