వ్యాక్సిన్ ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ - nizamabad dist news
శనివారం నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలను తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
వ్యాక్సిన్ ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లను పాలనాధికారి నారాయణ రెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. జిల్లాకేంద్రానికి ఇప్పటికే 302 మెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం సదుపాయాలను పరిశీలించారు. కొవిడ్ ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.
- నిజామాబాద్ 8309219718
- బోధన్ 08467 222001
- ఆర్మూర్ 08463 295050