రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 3 మొక్కలను నాటారు. ఎంపీ సంతోశ్ కుమార్ మంచి ఆశయంతో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు.
నిజామాబాద్‌లో 3 మొక్కలు నాటిన కలెక్టర్ - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 3 మొక్కలను నాటారు. ఎంపీ సంతోశ్ కుమార్ మంచి ఆశయంతో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు. జగిత్యాల, వనపర్తి కలెక్టర్, ములుగు జిల్లా ఎస్పీకి నామినేట్ చేస్తూ మొక్కలు నాటాల్సిందిగా కోరారు.
కామారెడ్డి కలెక్టర్ శరత్ విసిరిన ఛాలెంజ్‌ను నిజామాబాద్ కలెక్టర్ స్వీకరించారు. నిజామాబాద్ పాలనాధికారి నారాయణ రెడ్డి జగిత్యాల, వనపర్తి కలెక్టర్, ములుగు జిల్లా ఎస్పీకి నామినేట్ చేస్తూ మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి చేరే విధంగా.. జిల్లాలో నిర్మిస్తోన్న రైతు వేదికల వద్ద ఆ క్లస్టర్‌లోని ఆదర్శ రైతు, రైతు బంధు సమితి కన్వీనర్‌లు ఇద్దరు కలిసి మూడు మూడు మొక్కల చొప్పున నాటాల్సిందిగా సవాల్ విసురుతున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్