నిజామాబాద్ ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు ఒక వీడియో మెసేజ్‌ని పంపించారు. జిల్లాలో 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. జిల్లాను రెడ్‌జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు దిల్లీ మర్కజ్‌కు 63 మంది వెళ్లిరాగా అందులో 32 మందికి.. వారి కుటుంబ సభ్యులు 20 మందికి, మరో ఐదుగురు ఇతర కుటుంబ సభ్యులకు మొత్తంగా 57 కేసులు వీరి ద్వారా నమోదయ్యాయని.. మరొకటి దుబాయ్ వెళ్లివచ్చిన వారికి వైరస్ సోకిందని ఆయన మెసేజ్‌లో వివరించారు.
జిల్లాలో 20 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసి నో మూమెంట్ జోన్లుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని.. పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆనయ తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. అలా వచ్చిన సమయాల్లో భౌతిక దూరం పాటించాలని మాస్క్ ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.