తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమన్వయంతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం'

నిజామాబాద్ లోని ఖిల్లా రోడ్ లో గల డీ 54 కెనాల్ లోని పూడిక తీత పనులను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అపరిశుభ్రతను దూరం చేసేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

Collector collecting dredging works in the D54 Canal on Khilla Road, Nizamabad
'సమన్వయంతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం'

By

Published : Jun 1, 2020, 10:40 PM IST

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ జిల్లాలో అపరిశుభ్రతను దూరం చేసేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. నగరంలోని ఖిల్లా రోడ్ లో గల డీ 54 కెనాల్ లోని పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్య పనులపై సమీక్ష

సీజనల్‌ వ్యాధులను ముందస్తుగా అరికట్టేందుకు.. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజువారీగా చేపట్టే వార్డుల వివరాలను రూపొందించినట్లు నారాయణ రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు సభ్యులు, ప్రజలు ఇందులో భాగస్వామ్యమవుతున్నారని వివరించారు. నగరంలోని అన్ని వార్డులను కలియతిరిగి.. పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేశ్ వి పటేల్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

ఇదీ చూడండి:జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details