కార్మికుల పక్షాన నిలిచి సీఐటీయూ అనేక సమస్యలపై పోరాటం చేసి విజయం సాధించిందని నిజామాబాద్ జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నూర్జహన్ అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ రోజు సందర్భంగా నగరంలోని నాందేవ్ వాడలోని కార్యాలయం వద్ద సీఐటీయూ జెండాను జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. సీఐటీయూ ఐక్యత, పోరాటం నినాదంతో 1970లో కోల్కతా ఆవిర్భవించిందని నూర్జహన్ అన్నారు.
Citu: నిజామాబాద్లో సీఐటీయూ ఆవిర్భావ వేడుకలు - Citu news
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ (Citu) ఆవిర్భావ రోజు సందర్భంగా నాందేవ్ వాడలోని కార్యాలయం వద్ద సీఐటీయూ (Citu) జెండాను జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. సీఐటీయూ అనేక సమస్యలపై పోరాటం చేసి విజయం సాధించిందన్నారు.
citu
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, కార్మికవర్గాల పక్షాన నిలిచి పోరాడి అనేక హక్కులను సాధించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ (Citu) జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్ బాబు, మల్యాల గోవర్ధన్, ఈవీఎల్ నారాయణ, కృష్ణ, కటారి రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విగ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.