తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో తల్లిపాల వారోత్సవాలు - mother

నిజామాబాద్​ జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమని  కలెక్టర్​ రామ్మోహన్​ రావు అన్నారు.

కలెక్టర్​ రామ్మోహన్​ రావు

By

Published : Aug 1, 2019, 7:10 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ భవన్​లో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్​ రామ్మోహన్​ రావు హాజరయ్యారు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానమని, శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు తల్లిపాలు కీలకమన్నారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పడితే తల్లితో పాటు బిడ్డకు కూడా ఆరోగ్యమే అన్నారు. అపోహాలతో కొందరు బిడ్డలకు పాలు పట్టే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

నిజామాబాద్​లో తల్లిపాల వారోత్సవాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details