నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఏసీపీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యువకులకు క్రికెట్, వాలీబాల్ కిట్లు పంచారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా.. మంచిమార్గంలో నడవాలని సూచించారు. నిత్యం క్రీడల్లో పాల్గొంటే శారీరకంగా ఉల్లాసంగా ఉంటారని.. శారీరక ఉల్లాసం.. మానసిక ఉల్లాసానికి దారి తీస్తుందని అన్నారు.
క్రికెట్ కిట్లు పంచిన బోధన్ ఏసీపీ - నిజామాబాద్ జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఏసీపీ యువకులకు క్రికెట్, వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. యువకులు ప్రతిరోజు క్రీడలు ఆడి.. శారీరకంగా ధృడంగా ఉండాలని సూచించారు. శారీరకంగా ధృడంగా ఉంటే.. మానసికంగా బలంగా ఉంటామని ఆయన తెలిపారు.
క్రికెట్ కిట్లు పంచిన బోధన్ ఏసీపీ
యువకును శారీకరంగా ధృడంగా ఎదగేలా ప్రోత్సహించమని పోలీస్ కమిషనర్ కార్తికేయ గారి సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా క్రీడల కిట్లు పంచుతున్నట్టు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని.. ప్రజలెవరూ ఆ సమయంలో బయటకు రావద్దని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం