MLA Shakeel Comments on Moinabad Incident: మునుగోడు ఉపఎన్నికలో భాజపా గెలిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సవాల్ చేశారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్లో పర్యటించిన ఆయన.. మునుగోడులో తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని విమర్శించారు.
తెలంగాణలో తెరాస సర్కార్‌ను కూల్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే.. భాజపా అక్రమంగా సంపాదించిన డబ్బులతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ భాజపాకు అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు.