నిజామాబాద్ నగరంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేశారు. ఒక మనిషికి మరో మనిషే రక్తాన్ని ఇవ్వాలి కాబట్టి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి: బీజేవైఎం - తెలంగాణ వార్తలు
యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ బీజేవైఎం నాయకులు తెలిపారు. నగరంలోని రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మూడు నెలలకొకసారి అందరూ రక్తదానం చేయొచ్చని వెల్లడించారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, నిజామాబాద్‌లో రక్తదాన శిబిరం
ప్రతి ఒక్కరూ మూడు నెలలకొకసారి రక్తం దానం చేయొచ్చని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తం కొరతతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు.