తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం - BLOOD BANK OPENED BY MLA SHAKHIL IN BODHAN HOSPITAL

నిజామాబాద్ జిల్లా బోధన్ ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం కోసం రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించారు.

blood-bank-opened-by-mla-shakhil-in-bodhan-hospital
బోధన్ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం

By

Published : Dec 11, 2019, 6:01 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం రక్తనిధి కేంద్రాన్ని ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా అప్​గ్రేడ్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని వ్యాధులకు చికిత్స చేసే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డెంగ్యూ వ్యాధికి రోగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అనంతరం బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాలకు సంబంధించిన 350 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులను, 49 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

బోధన్ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details