స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, భాజపా ఎంపీ అర్వింద్ వర్గీయులు పొటాపోటీ నినాదాలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రసంగిస్తుండగా మోదీ మోదీ అంటూ భాజపా కార్యకర్తల నినాదాలు ఇచ్చారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతుండగా కేసీఆర్ కేసీఆర్ అంటూ తెరాస కార్యకర్తల నినాదాలు చేశారు. పసుపు బోర్డు కావాలంటూ తెరాస కార్యకర్తలు, యూరియా ఇవ్వాలంటూ భాజపా కార్యకర్తల స్లోగన్స్ ఇచ్చారు.
నిజామాబాద్‌లో రచ్చరచ్చ.. తెరాస, భాజపా పోటాపోటీ నినాదాలు - nizamabad
నిజామాబాద్ స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెరాస, భాజపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రసంగిస్తుండగా భాజపా కార్యకర్తలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతుండగా కేసీఆర్ కేసీఆర్ అంటూ తెరాస కార్యకర్తల నినాదాలు చేయడం వల్ల కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
నినాదాలు చేస్తున్న భాజపా కార్యకర్తలు