తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాం షుగర్స్​ కోసం పాదయాత్ర - నిజాం చక్కెర కర్మాగారం

బోధన్​లో నిజాం చక్కెర కర్మాగారాన్ని  తెరిపించాలని భాజపా నాయకులు పాదయాత్ర చేశారు. ఆ పార్టీ శ్రేణులు వీధుల్లో తిరుగుతూ నిరసన తెలిపారు. పరిశ్రమ తెరిపిస్తానన్న హామీని తెరాస విస్మరించిందని ఆరోపించారు.

భాజపా ర్యాలీ

By

Published : Mar 11, 2019, 10:50 AM IST

పాదయాత్ర చేస్తున్న భాజపా నాయకులు
నిజాం షుగర్స్​ను తెరిపించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఆసియాలో పేరెన్నికగన్న ఈ పరిశ్రమను తెరిపిస్తానని హామీ ఇచ్చిన తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ విమర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details