రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ భాజపా దీక్ష చేపట్టింది. రైతుగోస పేరుతో నేతలందరూ తమ తమ ఇళ్ల వద్ద ఈ దీక్షలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడంతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, తాలు, తరుగు పేరుతో రైతులను వేధించొద్దని డిమాండ్ చేస్తూ దీక్ష చేశారు.
'రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి' - భాజపా రైతుగోస న్యూస్
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని భాజపా నేతలు కూడా నిరసనలకు దిగారు.
bjp
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ఆర్మూర్ మండలం అంకాపూర్ లో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ లోని తన నివాసంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య తన నివాసం వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతుగోస దీక్షలో పాల్గొన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు.