వరంగల్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తెరాస శ్రేణుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. భాజపా జిల్లా కార్యాలయం నుంచి ప్రగతి నగర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
కవితను ఓడించినందుకే ఎంపీ అర్వింద్‌పై దాడులు: భాజపా - నిజామాబాద్ బీజేపీ వార్తలు
భాజపా ఎంపీ అర్వింద్‌పై తెరాస దాడికి నిరసనగా నిజామాబాద్‌లో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. దాడిని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
bjp
ఎంపీ అర్వింద్‌పై తెరాస దాడిని సిగ్గుమాలిన చర్యని భాజపా కార్పొరేటర్ న్యాలం రాజు అన్నారు. కవితను ఓడించినందుకే దాడికి పాల్పడుతున్నరా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే... దాడులు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు