తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెంటనే సర్వే చేయించి.. అర్హులకు న్యాయం చేయండి' - ఎంపీ అర్వింద్​

నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ పర్యటించారు. ప్రజాప్రతినిధులు నిరుపేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని స్థానికులు ఎంపీకి ఫిర్యాదు చేశారు.

bjp mp dharmapuri Arvind visited nizamabad city
'వెంటనే సర్వే చేయించి.. అర్హులకు న్యాయం చేయండి'

By

Published : Mar 5, 2021, 7:26 PM IST

నిరుపేదల భూములు కబ్జాకు గురవుతున్నాయన్న సమాచారంతో.. ఎంపీ అర్వింద్​ నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. ఎమ్మెల్యే, మేయర్లు.. అవినీతికి పాల్పడుతున్నరంటూ స్థానికులు ఎంపీ ఎదుట వాపోయారు.

2005లో అప్పటి ప్రభుత్వం.. నిరుపేదలకు ఇచ్చిన భూమిని, తిరిగి 2014లో జర్నలిస్టులకు కేటాయించడంతో వివాదాలు తలెత్తాయని.. స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయించి.. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని అర్వింద్​ డిమాండ్​ చేశారు. వేరే ఇతర ప్రాంతాల్లో జర్నలిస్టులకు స్థలాలు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి:మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి ఏమైనా చేస్తాడు: రఘునందన్​

ABOUT THE AUTHOR

...view details