MP Arvind Fires MLC Kavitha : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఓడించే బాధ్యత తమదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబానికి ఓటమి నేర్పింది ఇందూరు గడ్డ అని.. పేర్కొన్నారు. అంకాపూర్ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేశ్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరాక మొదటిసారిగా ఆర్మూర్‌కు రావడంతో మంగళవారం (జూన్ 6న) భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అర్వింద్ హాజరై మాట్లాడారు.
Dharmapuri Arvind Latest Comments :ఆర్మూర్‌లో నుంచి ఎవరు పోటీ చేసిన మైసమ్మకు మేకపోతును బలిచ్చినట్లే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో వారు ఇదే డైలాగ్ చెప్పారని.. చివరికి ఎవరు బలయ్యారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే బీజేపీ ర్యాలీకి రాకుండా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కొందరిని బెదిరించారని ఆరోపించారు. జీవన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తామని సవాల్ చేశారు.
- పసుపు బోర్డు ఫ్లెక్సీలపై అర్వింద్ రియాక్షన్ ఇదే...
- 'ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి.. ఎందుకు సుప్రీంను ఆశ్రయించారు?'
ఇదీ జరిగింది:నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకుడు పైడి రాకేశ్‌రెడ్డి స్వాగత ర్యాలీ జరిగింది. పెర్కిట్ బైపాస్ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి ఆయన కార్లలో ర్యాలీ చేపట్టారు. ఆర్మూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇరువురు నివాళులర్పించారు. అనంతరం బహిరంగంగా ప్రసంగించారు. అంకాపూర్‌కు చెందిన పైడి రాకేశ్‌రెడ్డి పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి 300 కార్లతో ఆర్మూర్‌లో అడుగు పెట్టారని దీనితో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి హార్ట్ రేటు 300కు చేరిందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ర్యాలీకి ఎవరు వెళ్లొద్దంటూ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారని ఆరోపించారు.