కేంద్రం నిధుల కేటాయింపుపై చర్చకు రావాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి (BANDI SANJAY) మంత్రి కేటీఆర్ (MINISTER KTR) విసిరిన సవాల్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP ARVIND) ఘాటుగా స్పందించారు. కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు ఎంపీ అర్వింద్. లేదంటే రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఇచ్చే పన్నుల కంటే తెలంగాణకు కేంద్రం ఎక్కువే అందిస్తోందని చెప్పారు. దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని.. మంత్రి హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బియ్యం సేకరణ కోసం ప్రతిపైసా ఇప్పటి వరకు కేంద్రమే ఇచ్చిందని స్పష్టం చేశారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు, సొయా, చెరుకు వంటి పంటలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కనపడకుండా పోయాయని ఆరోపించారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపులో కర్క్యుమిన్ శాతం పరిశీలించే యంత్రాన్ని పర్యవేక్షించారు.