రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిజామాబాద్ ఎంపీ మండిపడ్డారు. జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. సన్న వరి సాగు చేయాలని రైతులకు చెప్పి, మద్దతు ధర ప్రకటించకుండా మోసం చేశారని ఆరోపించారు.
రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం: ఎంపీ అర్వింద్ - నిజామాబాద్ సమాచారం
తెలంగాణ రైతులను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. సన్న వరి వేయమని చెప్పి రైతులకు మద్దతు ధర ప్రకటించడం పోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. మక్కలు కొనుగోలు చేస్తామని రైతన్నలను నిండా ముంచారని మండిపడ్డారు.
రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం: ఎంపీ అర్వింద్
మొక్కజొన్న పంటను 70 శాతం పూర్తయ్యాక కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులకు అన్యాయం చేయడమేనని తప్పుబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని అన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే బ్యాంకులు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రాబోయే మూడేళ్లు ఇలాగే కొనసాగితే రైతులు వ్యవసాయాన్ని వదిలేయాల్సిన దుస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.