తెలంగాణ

telangana

ETV Bharat / state

కమలం పరువు దక్కేనా..!

తెలంగాణ గడ్డపై మళ్లీ కాషాయ జెండా కనిపిస్తుందా..? అసెంబ్లీ ఎన్నికల్లో వాడిపోయిన కమలం లోక్​సభ ఎన్నికల్లో నిలదొక్కుకుంటుందా..? అమిత్​ షా వ్యూహాలతో పోయిన పరువు నిలబడుతుందా..?

కాషాయ జెండా కనిపిస్తుందా..!

By

Published : Mar 5, 2019, 6:01 PM IST

తెలంగాణలో పరువు నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పొరపాట్లను సరిదిద్దుకుని లోక్​సభ సమరానికి సై అంటోంది. నాలుగు నుంచి ఐదు లోక్​సభ స్థానాలే లక్ష్యంగా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా అడుగులేస్తున్నారు. బుధవారం నిజామాబాద్​ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు.

కమలం పరువు దక్కేనా..!

ఐదేళ్ల క్రితం మోడీ మేనియా దేశవ్యాప్తంగా సునామీలా పాకింది. తెలంగాణలో మాత్రం ఒక్క పార్లమెంట్​ సీటుతోనే సరిపెట్టుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారుజోరులో కొట్టుకుపోయింది. ఆఖరికి సిట్టింగ్​ స్థానాలను కోల్పోవడమే కాదు వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ పోగొట్టుకుంది. ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో పోయిన పరువు దక్కించుకోవాలని ఆశ పడుతోంది.16స్థానాలను గెల్చుకుంటామని సవాల్​ చేస్తున్న తెరాసను ఢీకొట్టేందుకు బలమైన ప్రత్యర్థులను రంగంలోకి దింపాలనుకుంటోంది భాజపా.

ఐదు స్థానాలే లక్ష్యం

ఇప్పటికే లోక్​సభ నియోజకవర్గాలను నాలుగు కస్టర్లుగా విభజించిన కమలదళం.. నాలుగైదు స్థానాలను గెల్చుకునేందుకు ప్రచారాన్ని షురూ చేస్తోంది. కాస్తో కూస్తో కార్యకర్తల బలమున్న సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, నిజామాబాద్, మహబూబాబాద్ సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తొలివిడతగా భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​షా నిజామాబాద్లో అడుగుపెడుతున్నారు.

అమిత్​షా మ్యాజిక్ పనిచేస్తుందా..!

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ అగ్రనేతలు కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన ఒక్క సీటు రాలేదు కదా దాదాపు వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లతయ్యింది. మరీ ఈసారి అమిత్​షా పర్యటన కలిసొస్తుందా..? లేక మళ్లీ చతికల పడుతుందా..? వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details