తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో 2019-2020 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకోసం శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య లింబాద్రి ఆధ్వర్యంలో టీఎస్‌టీఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ బలరాములు, టీఎస్‌టీఎస్ సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసినట్లు కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయని కళాశాలలపై చర్యలు ఉంటాయని, విద్యార్థుల పరీక్ష ఫీజును కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు.