నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఉపకులపతి అనిల్ కుమార్ ప్రారంభించారు. అధ్యాపకులు, విద్యార్థినులు రంగురంగుల బతుకమ్మను అందంగా అలంకరించి వేడుకలు నిర్వహించారు. సాంప్రదాయ పాటలతో ఆడిపాడి.. ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండగ అని, అందరూ కలిసి మెలిసి జరుపుకొని ఐక్యత చాటుతారని విశ్వవిద్యాలయం మహిళా విభాగం సంచాలకురాలు ప్రసన్నశీల అన్నారు. పూల పండగలో సైన్సు దాగి ఉందని, రాబోయే తరాలకు పండగ విశిష్టత తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ బలరాములు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబురాలు - డిచ్పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అధ్యాపకులు, విద్యార్థినులు బతుకమ్మను అందంగా అలంకరించి వేడుకలు నిర్వహించారు.
బతుకమ్మ సంబురాలు