మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. గోదావరిలోకి నీరు ఉరకలువేయడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్లీ గేట్లు ఎత్తివేత: జలకళను సంతరించుకున్న త్రివేణి సంగమం - latest news of nizamabad
బాబ్లీ గేట్లు ఎత్తడం వల్ల రాష్ట్రంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద ఉన్న త్రివేణి సంగమం నీటితో కలకళలాడుతోంది. గోదారి నీరు ఉరకలేస్తుండడం చూసిన రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
బాబ్లీ గేట్లు ఎత్తివేత: జలకళను సంతరించుకున్న త్రివేణీ సంగమం
నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలను, జాలర్లను అధికారులు ముందే అప్రమత్తం చేశారు. నది నీటి ప్రవాహం పెరగడం వల్ల చేపలను పట్టడానికి వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!