నిజామాబాద్ జిల్లా నాగారంలో నీటి కుంటలో పడి విద్యార్థులు మృతి ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యావలంటీర్ జలీల్‌ను విధుల నుంచి తొలగించగా.. ప్రధానోపాధ్యాయుడు సిరాజ్, ఉపాధ్యాయుడు అజీజ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న నాగారం ఉర్దూ మీడియం పాఠశాల నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. బయటకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారో లేదో చూడకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకున్నారు.
విద్యార్థుల మృతి ఘటనలో అధికారుల చర్యలు
నీటి కుంటలో పడి విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు, విద్యా వలంటీర్‌పై చర్యలు తీసుకున్నారు.
పిల్లలు పడి చనిపోయిన నీటి గుంత