తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి' - mr gardens

ఆర్మూర్ ప్రాంతానికి చెందిన తెరాస నాయకులు వారణాసిలో ప్రధాని మోదీపై నామినేషన్ వేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులుకాదు తెరాస నాయకులు..

By

Published : Apr 25, 2019, 7:15 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్ గార్డెన్​లో పార్లమెంట్​ బరిలో ఉన్న రైతులు సమావేశమయ్యారు. రైతు ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని వారు సైతం మేము రైతులమని బస్సులో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. అన్నదాతలు ఐదు సార్లు రోడ్డు పైకి వచ్చి నిరసనలు చేసినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. పసుపు బోర్డు మద్ధతు ధర కోసం మేము పోరాడుతున్నామని తెరాస నాయకులు చెప్పుకోవడం సరికాదన్నారు. భాజపా ,కాంగ్రెస్, తెరాస పార్టీలు రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆరోపించారు.

రైతులుకాదు తెరాస నాయకులు..

ABOUT THE AUTHOR

...view details