కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ విజృంభిస్తోందని అఖిల భారత రైతుకూలి సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగధరప్ప పేర్కొన్నారు. ఏఐకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరోనా వైరస్ వ్యాప్తి' - ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరోనా వైరస్ వ్యాప్తి
కరోనా వైరస్ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అఖిల భారత రైతుకూలి సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగధరప్ప అన్నారు. స్థానిక ఏఐకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరోనా వైరస్ వ్యాప్తి
ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి కొవిడ్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతుకూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు