నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన నల్లవెల్లి పెద్దగంగారెడ్డి 2 సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం గల్ఫ్ బాటపట్టాడు. అక్కడ ఎంతో కొంత సంపాదించి తిరిగి వచ్చి తమకుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని ఎన్నో కలలతో, ఆశలతో వెళ్లిన అతను ఏడాదికే అనారోగ్యానికి గురై నానా అవస్థతలు పడుతున్నారు. తన భర్తను ఎలాగైనా భారత్‌కు తీసుకురావాలని గంగారెడ్డి భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
నా భర్తను స్వదేశానికి రప్పించడి సారూ! - గల్ఫ్బాధితులను స్వదేశానికి రంప్పించాలంటూ ఓ మహిళ ఆవేదన
గల్ఫ్‌దేశానికి వెళ్లి తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తెలంగాణ గల్ఫ్ వెల్పేర్ అసోసియేషన్‌ను ఆశ్రయించింది. వెంటనే తన భర్తను స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటుంది.
నా భర్తను స్వదేశానికి రప్పించడి సారూ!
తన భర్తను వెంటనే స్వదేశానికి తీకువచ్చేలా చూడాలంటూ తెలంగాణ గల్ఫ్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డిని ఆశ్రయించింది. లాక్డౌన్ కారణంగా గల్ఫ్‌దేశాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత్ తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బసంత్‌రెడ్డి అధికారులను కోరారు.
TAGGED:
latest news of nizamabad