తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో స్వల్ప అగ్నిప్రమాదం - fire accidents

గుర్తు తెలియని వ్యక్తుల నిర్లక్ష్యం స్వల్ప అగ్నిప్రమాదానికి కారణమైంది. మున్సిపల్​ సిబ్బంది అప్రమత్తతతో నష్టం జరగలేదు.

muncipal staff

By

Published : Feb 5, 2019, 4:16 PM IST

నిజామాబాద్​లో అగ్నిప్రమాదం
నిజామాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్​ పక్కన గల పాత మున్సిపల్​ అతిథి గృహం వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గత కొన్ని రోజులుగా తడి పొడి చెత్తను వేరు చేసే క్రమంలో డంపు చేయడం వల్ల గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగింది. మున్సిపల్​ సిబ్బంది అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టమూ జరగలేదు.

ABOUT THE AUTHOR

...view details