నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 121 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. రోజురోజుకు కరోనా వ్యాప్తి చెందుతున్నందున పరోక్ష పద్ధతిలో ప్రజావాణిని నిర్వహించారు.
ప్రజావాణిలో ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తాం: కలెక్టర్ - prajavani program in nizamabad
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పరీక్ష పద్ధతిలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ మార్గాల ద్వారా మొత్తం 121 ఫిర్యాదులు అందినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
ప్రజావాణి ద్వారా 121 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె ద్వారా 72, ఫోన్ ద్వారా 18, వాట్సాప్ ద్వారా 20, ఈ-మెయిల్ ద్వారా 7 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టె నుంచి రెండు ఫిర్యాదు రాగా మొత్తం 121 ఫిర్యాదులను స్వీకరించామని కలెక్టర్ వెల్లడించారు.