సైన్యానికి పూజలు - pray for army
ఉగ్రమూకలపై దాడులతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్రివిధ దళాలకు మహా శక్తి ప్రసాదించాలని బాసరలో ప్రత్యేక పూజలు చేశారు.
భారత సైనికుల వైమానిక దాడులను ప్రశంసిస్తూ బాసరలోని గోదావరి నదీ తీరాన వేద భారతి పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత త్రివిధ దళాలకు, రాజ్యాధినేతకు మహా శక్తి ప్రసాదించాలని వేద భారతీ పీఠం ఆధ్వర్యంలో వేద విద్యార్థులు యజ్ఞయాగాధి క్రతువులు నిర్వహించారు.
వృథా కాదు మీ మరణం..
ఉగ్రదాడిలో అమరులైన సైనికుల త్యాగం వృథా కాదని వేద భారతీ పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానoద గిరి స్వామీజీ అన్నారు. వారి జ్ఞాపకాలు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:అమరవీరులకు నివాళి