నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో కృష్ణవేణి కలిశారు. మహా శివరాత్రి జాతర మహోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు.
మహా శివరాత్రి వేడుకలకు మంత్రికి ఆహ్వానం - ఇంద్రకరణ్ రెడ్డి
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవస్థాన ఈవో కృష్ణవేణి ఆహ్వాన పత్రికను అందించారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి జాతరకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం వేములవాడలో చేపట్టిన మహోత్సవ జాతర ఏర్పాట్లను ఈవో మంత్రికి వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవోను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
ఇదీ చదవండి:ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి