నిర్మల్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీపీవో శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా లెక్కింపు చేపడతామన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన ఓట్లను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ముథోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఓట్లకు ఏఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో లెక్కించనున్నట్లు తెలిపారు. ఖానాపూర్లోని నాలుగు మండలాల ఓట్లను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్కింపు చేపడతామన్నారు. జిల్లా పాలనాధికారి ప్రశాంతి లెక్కింపు కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు - vote counting
నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పాలనాధికారి ప్రశాంతి లెక్కింపు కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు