తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసరలో వసంత పంచమి ఉత్సవాలు - BASARA

బాసరలో సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.

వైభవంగా అమ్మవారి వేడుకలు

By

Published : Feb 8, 2019, 7:53 PM IST

వైభవంగా అమ్మవారి వేడుకలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. గణపతి పూజ, చండీ హోమంతో వేడుకలు ప్రారంభించారు. ముథోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ప్రశాంతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆలయంలో ఈ టికెటింగ్ విధానాన్ని పలానాధికారి ప్రశాంతి చేతుల మీదుగా ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలొస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details