తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ - CANDLE RALLY

ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ... నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Oct 14, 2019, 10:37 AM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఖమ్మంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మ శాంతించాలని కోరుతూ... నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ డిపో నుంచి జయశంకర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. అమరవీరుడు శ్రీనివాస్​ రెడ్డికి జోహార్లు అంటూ కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం ఆయన చిత్రపటం ముందు కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ రెడ్డి ప్రాణ త్యాగాన్ని వృథా కానీయమని ఆర్టీసీ ఉద్యోగులు అన్నారు. ఆయన ఆశయ సాధనకై ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో అలాంటి చర్యలకు ఏ కార్మికుడు పాల్పడవద్దని కోరారు. అందరం కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి పోరాడుదామని స్పష్టం చేశారు.

నిర్మల్​లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details