పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. నిరసన ర్యాలీలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్‌లోని అంబేడ్కర్ చౌక్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కూడా హస్తం పార్టీదేనని వెల్లడించారు. కేవలం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ, కేసీఆర్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని రేవంత్ విమర్శించారు.
వేల కోట్లు దోచుకున్నాయి..
దేశంలో పేదవాడు పేదోడిగానే ఉంటున్నారన్నారు. కేవలం 50రూపాయలు ఉన్న పెట్రోల్‌ను ఏడేళ్లలోనే వందకు మించేలా చేశారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని రేవంత్ విమర్శించారు. ఎన్నో పేద దేశాల్లో పెట్రోల్ ధరలు తక్కువగానే ఉన్నాయని... భారత్ మాత్రం ఇంతగా పెంచేశారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పన్నుల మీద కేంద్రం 36లక్షలు కోట్లు, రాష్ట్ర సర్కారు 19వేల కోట్లు దోచుకున్నాయని రేవంత్ విమర్శించారు.
మహేశ్వర్ రెడ్డిని గెలిపించాలి..