నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రహీం 6 నెలల నుంచి నిర్మల్ జిల్లా ముథోల్‌లోని పంజశా కాలనీలో అద్దెకుంటున్నారు. రహీం నిజామాబాద్‌లో ప్రైవేటు వైద్యుడు. భార్య ముథోల్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయురాలు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువా తాళం తీసి ఉండగా... దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 50 వేల నగదు అపహరణకు గురైనట్టు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగానికి వెళ్లొచ్చేసరికి ఊడ్చుకెళ్లారు..
భర్త డాక్టర్... భార్య టీచర్... ఇద్దరు రోజులానే విధులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు దుండగులు.
THEFT IN DOCTORS HOUSE