తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు ధైర్యం నూరిపోస్తున్న పోలీసులు - విద్యార్థులకు పోలీసులు ధైర్యం

టెన్షన్​ పడుతూ ఇంటర్​ పరీక్షలు రాయడానికి వస్తోన్న విద్యార్థులకు నిర్మల్​ పట్టణ పోలీసులు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పరీక్ష బాగా రాయండంటూ పువ్వులిచ్చి పరీక్షా కేంద్రానికి స్వాగతం పలికారు.

The police are inviting an innovative way intermediate exam students in nirmal
​ విద్యార్థులకు వినూత్నంగా ధైర్యం చెప్తున్న పోలీసులు

By

Published : Mar 5, 2020, 7:24 PM IST

ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వినూత్నంగా విధి నిర్వహణ చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను పువ్వులతో స్వాగతం చెప్పారు. ఆల్ ది బెస్ట్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నూరిపోశారు.

టెన్షన్​తో వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల స్వాగతం పలుకుతున్న తీరుకు చూసి మురిసిపోయారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను పొగడ్తలతో ముంచెత్తారు.

​ విద్యార్థులకు వినూత్నంగా ధైర్యం చెప్తున్న పోలీసులు

ఇదీ చూడండి:నిర్భయ దోషులకు డెత్​ వారెంట్​- మార్చి 20న ఉరి అమలు

ABOUT THE AUTHOR

...view details