నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మారుమూల గిరిజన గ్రామలైన మొర్రిగూడెం, బూరుగుపల్లి, పులిమడుగు తండాల్లో కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. గిరిజనులకు వైద్య శిబిరం నిర్వహించి, నిత్యావసరాలు అందజేశారు. నిర్మల్‌కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అప్పాల చక్రధారి... వైద్య పరీక్షలు నిర్వహించి మల్టీ విటమిన్, ఐరన్, కాల్షియం మాత్రలు, మందులు అందజేశారు. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకి చేయూత
అసలే మారుమూల గ్రామాలు. అందులో గిరిజన జనం. రవాణా సౌకర్యం ఉండదు. అందులోనూ కరోనా లాక్ డౌన్ కారణంగా వారి కష్టాలు అంతా ఇంతా కాదు. అలాంటి గిరిపుత్రులకు అనారోగ్యాలు ఎదురైతే నాటువైద్యం తప్ప మరో అవకాశం లేదు. అది గమనించిన నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కావేరి ఫౌండేషన్ మీకు తోడు మేం ఉన్నామంటూ ముందుకు సాగుతుంది.
The kaveri Foundation has set up a medical camp for tribals in Nirmal district
లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సుమారు 100 గిరిజన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారం, ఉప సర్పంచ్ రవి, కో ఆర్డినేటర్ పోలీస్ భీమేష్, ప్రాజెక్ట్ ఇంఛార్జీ దీపక్, సిబ్బంది చంటి, రాజేష్, కపిల్, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బికినీ రంగుపై రాజకీయ రగడ!