సాయి నామామృతం - SING
చిన్నారుల కోలాటాలు, భక్తి పాటలు, భజన గీతాలతో సాయి పారాయణం కనులపండువగా సాగింది. బాబా వేషధారణలోని భక్తుడు చూపరులను ఆకట్టుకున్నాడు.
SAI
నిర్మల్ జిల్లాలో సాయిబాబా భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి పారాయణంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా ఆలయంలో సాయి పాదుకలు, పల్లకి అలంకరించారు. సాయిబాబా వేషధారణలో వ్యక్తికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులకు పారాయణ గ్రంథాలను అందజేశారు.