టమాటా సాగు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుందని రైతులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లోని భైంసా మార్కెట్లో టమాటా పంటను కొనేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టించి పండించిన పంట పశువుల పాలవుతుందంటున్నారు.
గిట్టుబాటు ధరలేక పశువులకు ఆహారమవుతున్న టమాటా
టమాటా పంటకు కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కిలో టమాటా రూపాయికి కొనుగోలు చేస్తున్నారని ఇలా అయితే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా ముధోల్కు చెందిన రైతులు.
గిట్టుబాటు ధరలేక పశువులకు ఆహారమవుతున్న టమాటా
రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు... అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి టమాటా పంటను కనీస ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా మార్కెట్ యార్డుల్లో శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.