నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలోని 3వ వార్డు నుంచి బొల్లి మహేందర్ సహకార ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు మహేందర్‌కు టార్చి లైట్ గుర్తు కేటాయించారు.
'నాది టార్చిలైట్ గుర్తు అయితే బ్రష్ గుర్తు ముద్రించారు'
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న సహకార ఎన్నికల పోలింగ్‌లో ఒక గుర్తుకు బదులు మరో గుర్తును ఏర్పాటు చేశారు. దీనివల్ల గంటపాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది.
జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రంలో టార్చిలైట్ గుర్తు బదులు బ్రష్ గుర్తు ప్రింట్ చేశారు. పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత అభ్యర్థి ఈ విషయాన్ని గమనించారు. వెంటనే ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లగా... బ్రష్ గుర్తును చెరిపివేసి అభ్యర్థికి కేటాయించిన టార్చిలైట్ గుర్తును ఏర్పాటు చేశారు. దీనివల్ల సుమారు గంటపాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది.
బ్యాలెట్ పేపర్లు సరిగ్గానే ముద్రించామని, గుర్తులు మాత్రం తప్పుగా ప్రింట్ అయ్యాయని ఎన్నికల అధికారి తెలిపారు.
- ఇదీ చూడండి :బీరోలు సహకార ఎన్నికల పోలింగ్‌లో డబ్బుల పంపిణీ