స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పేర్కొన్నారు. స్ఫూర్తి నిర్మాణ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నేటి యువతకు వివేకానంద ఆదర్శం : మున్సిపల్ ఛైర్మన్ - నిర్మల్ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నేటి యువతరం స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పురపాలక ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి నిర్మాణ్ సొసైటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నేటి యువత మంచిమార్గంలో పయనించి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్వామి వివేకానంద యువతకు ఆదర్శంగా నిలిచాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి ముత్తన్న, శ్రావణ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ అకోజు కిషన్, ఇతరులు పాల్గొన్నారు.