తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో జూన్​ 1 నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం - నిర్మల్​ జిల్లా వార్తలు

నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ ఫారూఖీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులతో మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో జూన్​ 1 నుంచి 8 వరకు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ముందుండి నడపాలని కలెక్టర్​ సూచించారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

special sanitization programme in nirmal district
జిల్లాలో జూన్​ 1 నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

By

Published : May 29, 2020, 9:20 PM IST

నిర్మల్ జిల్లాలో జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు ముందుండి నడపాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో పత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహించు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో అధికారులతో పాటు సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉత్తర్వు 189 ప్రకారం కార్యక్రమాలను పగడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన విధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న నాలాల్లో, ఖాళీ స్థలాల్లో, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని తెలిపారు.

మురికి కాలువలలో జేసీబీ ద్వారా మట్టిని తొలగించాలని అన్నారు. తాగునీరు అందించే ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, ఓహెచ్ఆర్​ఎస్ బ్లీచింగ్ పౌడర్ వేయాలని, నీటి సరఫరా పైప్​లైన్లలో లీకేజీ లేకుండా నీటి సరఫరా చేయాలని కోరారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లోని కూలర్లు, కుండలు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిలవడం వల్లే డెంగీ జ్వరాలు వస్తాయని వివరించారు. ఆ నీటిని తొలగించాలని చెప్పారు. శానిటైజేషన్​పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి గ్రామంలో కనీసం నాలుగు సార్లు సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. జూన్ 5న డ్రైడే పాటించాలన్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ సడలించినా.. అంతంతమాత్రం గిరాకీనే!

ABOUT THE AUTHOR

...view details