తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసా అల్లర్ల కేసు సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టు - తెలంగాణ వార్తలు

భైంసా అల్లర్ల కేసు సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్‌లోని సీనియర్‌ న్యాయవాది ముస్కు రమణారెడ్డిని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. ఈ ఏడాది మార్చి 7న రాత్రి రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Special court, bhainsa case
భైంసా కేసు కోసం ప్రత్యేక కోర్టు, హైకోర్టు

By

Published : May 31, 2021, 8:44 AM IST

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల కేసు సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్‌లోని సీనియర్‌ న్యాయవాది ముస్కు రమణారెడ్డిని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. ఈ ఏడాది మార్చి 7న రాత్రి భైంసాతో పాటు కుభీర్‌ మండలంలో రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపుగా నెలరోజుల పాటు కర్ఫ్యూ విధించారు.

ఈ ఘటనల్లో ఇరువర్గాలకు చెందిన 91 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... భైంసా, కుభీర్‌ పోలీసు స్టేషన్లలో 32 కేసులు నమోదు చేశారు. నిందితులందరినీ రిమాండ్‌కు తరలించారు. కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆదిలాబాద్‌లోని మొదటి అదనపు జిల్లా న్యాయస్థానాన్నే ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఇదీ చదవండి:rythubandhu: రైతుబంధుకు సిద్ధమవుతున్న లెక్కలు

ABOUT THE AUTHOR

...view details