తమ సమస్యలు పరిష్కరించాలంటూ హమాలీలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పౌరసరఫరాల్లో పనిచేసే తాము విధి నిర్వహణలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖను వ్యవపాయ శాఖలో విలీనం చేయొద్దని కోరారు. అన్ని గోదాముల వద్ద దిగుమతి కాంటాలు ఎత్తివేసి , హమాలీ కూలీలను 24కు పెంచాలని, ఈఎస్‌ఐ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'మా సమస్యలను వెంటనే తీర్చండి'
నిర్మల్ జిల్లా పౌరసరఫరా శాఖలో పనిచేసే తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు హమాలీలు ఆందోళనకు దిగారు.
పౌరసరఫరాల శాఖను వ్యవపాయ శాఖలో విలీనం చేయొద్ధు : హమాలీలు