ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆశ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంయుక్త పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లపై పనిభారం తగ్గించాలని కోరారు.
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి - STATE AND CENTRAL GOVERNMENT
చాకిరీకి ఏ మాత్రం తక్కువ కావు వారి సేవలు. అయినా వారికిచ్చే వేతనాలు అంతంత మాత్రమే...ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఐదు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు.
ఆందోళన బాట పట్టిన ఆశ వర్కర్లు