తెలియని జబ్బుతో రోజురోజుకూ చిక్కి శల్యమవుతున్న చిన్నారి దీనగాథను వివరిస్తూ ప్రచురితమైన నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన 'చిట్టితల్లికి కొండంత వేదన... చేయూత కోసం తల్లిదండ్రుల అభ్యర్థన' అనే కథనానికి పలువురు దాతలు స్పందించారు. రూ.17,100 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చంద్ర అవంతిక తన తండ్రి సహకారంతో రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
స్పందన: చిట్టి తల్లి వైద్యానికి దాతల ఆర్థిక సాయం
చిన్న వయసులోనే మృత్యువుతో పోరాడుతున్న 'చిట్టితల్లికి కొండంత వేదన... చేయూత కోసం తల్లిదండ్రుల అభ్యర్థన' అనే కథనానికి పలువురు దాతలు స్పందించారు. చిన్నారికి వైద్యం అందించడానికి సుమారు రూ.17 వేలు సాయం అందించి తమ ఉదాసీనతను చాటుకున్నారు.
బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరు కావాల్సిన ఈ కుటుంబం, కరోనా కారణంగా వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో ఈనాడు పత్రికలో చదివిన కథనంతో చలించారు. వేడుకలో ఇచ్చేబదులుగా బాలికను ఆదుకునేందుకు ఉపయోగపడతాయనే కారణంతో డబ్బు పంపించారు. నిర్మల్ పట్టణం, హైదరాబాద్, కుమురంభీం జిల్లా చెందిన వారు ఇలా ఎవరికిి తోచిన సాయం వారు అందించారు. తమ చిన్నారిని కాపాడేందుకు సాయం అందించిన ప్రతి ఒక్కరికీ బాలిక తల్లి జయ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి :చిట్టితల్లికి కొండంత వేదన... చేయూత కోసం తల్లిదండ్రుల అభ్యర్థన