కుంసరలో ఘనంగా సప్త వేడుకలు - hanuman temple
నిర్మల్ జిల్లాలోని భైంసాలో హనుమాన్ ఆలయంలో కలశరోహన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఘనంగా సప్త వేడుకలు
నిర్మల్ జిల్లా భైంసా మండలం కుంసర గ్రామంలోని హనుమాన్ ఆలయంలో కలశరోహన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సప్త వేడుకలు ఘనంగా కొనసాగాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామస్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో సామూహిక హారతులుతో పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.