నిర్మల్ ప్రయాణ ప్రాంగణంలో సాయిబాబా ఏడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టికెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన సాయి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయి పారాయణంతో ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గడ్డం సతీష్ చంద్రశేఖర్ రెడ్డి, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆర్టీసీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రయాణ ప్రాంగణంలో సాయిబాబా వార్షికోత్సవం - sai
ప్రయాణ ప్రాంగణంలో సాయి వార్షికోత్సం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజం బస్టాండ్లోని టికెట్ కౌంటర్ వద్ద సాయిబాబా చిత్రపంట ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించారు.
సాయిబాబా