కరోనా రెండోదశ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులను ఫ్రంట్లైన్ కార్మికులుగా గుర్తించాలని కోరుతూ... నిర్మల్ డిపో ఎదుట మంగళవారం ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి... నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ కార్యదర్శి రమేశ్ కోరారు. అలాగే తార్నాకలో కొవిడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు.
ఫ్రంట్లైన్ కార్మికులుగా గుర్తించాలని ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
తమని ఫ్రంట్లైన్ కార్మికులుగా గుర్తించాలని ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. నిర్మల్ డిపో ఎదుట మంగళవారం ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి... నిరసన తెలిపారు.
RTC employees